News

భవిష్య‌త్ త‌రానికీ ఆశాకిర‌ణం తుకారాం మ‌హారాజ్: ప్రధాని మోదీ

499views

న్యూఢిల్లీ: సంత్ తుకారాం ప్రస్తుత సమాజానికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాకిరణమ‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పూణే సమీపంలోని దేహు గ్రామంలో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని మోదీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జైల్లో ఉన్నప్పుడు వీర్ సావర్కర్ సంత్ తుకారాం అభంగ్స్ (విఠల్ భగవానుని స్తుతిస్తూ భక్తి కవిత్వం) పాడారని ఆయన అన్నారు.

సంత్ తుకారాం ఒక సన్యాసి, కవిగా ప్ర‌సిద్ధి చెందార‌న్నారు. 17వ శతాబ్దపు మరాఠీ కవి అయిన సంత్ తుకారాం మహారాజ్… సమతావాద‌న్నారు. అతను దేహులో నివసించాడ‌ని, మరణానంతరం శిలా మందిరాన్ని నిర్మించారు.. కానీ, అది అధికారికంగా ఆలయంగా నిర్మించబడలేద‌ని తెలిపారు. నేడు ఇది 36 శిఖరాలతో రాతి రాతితో పునర్నిర్మించబడింద‌ని, ఇందులో సంత్ తుకారాం విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించార‌న్నారు. కాగా, అంతకుముందు, దేహు ప్రధాన ఆలయంలోని విఠల్-రుక్మిణి విగ్రహాలను ప్రధాని సందర్శించారు. శిలా మందిరం ముందు నిర్మించిన భగవత్ ధర్మానికి సంబంధించిన ప్రతీక స్తంభానికి పూజ‌లు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి