
అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామంలో ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ స్థానికులు చేసుకున్న విన్నపాన్ని ప్రభుత్వాధికారులు ఆలకించని దుస్థితి నెలకొంది. తమ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేకపోయినా, ఎలాంటి అనుమతులూ లేకుండానే ఒక చర్చిని నిర్మిస్తున్నారని ఆ గ్రామస్థులు వాపోతున్నారు.
అక్రమ చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవలసిందిగా కోరుతూ గ్రామస్థులు తహశీల్దార్ కి విన్నవించారు. తహశీల్దార్ వీరి ఫిర్యాదుకు ఏమాత్రమూ స్పందిచలేదు సరికదా “నిర్మాణం పూర్తయ్యాక చూద్దాం” లెమ్మంటున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక “ఎలాగూ నిర్మాణం పూర్తయిపోయింది కదా? ఇక చేసేదేముంది? అని అంటారని కూడా తమకు తెలుసని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయ సిబ్బందిని కూడా ఈ విషయమై సంప్రదించామని, వారి నుంచి కూడా తమకు అలాంటి స్పందనే ఎదురైందని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ విషయంపై హిందూ సంస్థల వారెవరైనా వెంటనే స్పందించి అక్రమ చర్చి నిర్మాణాన్ని ఆపడంలో తమకు సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.





