ArticlesNews

అజ్ఞానమా.. అభద్రతా? 1 వ భాగం

5views

ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ చేసుకున్న సంస్థ కాదు అంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా ఓ ప్రశ్న లేవదీశారు. ఇది అజ్ఞానమా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అదీ కాకుంటే అభద్రతా భావమా? అనే  ఒక ముఖ్యమైన సందేహానికి ఇలాంటి ప్రశ్న దారితీస్తుంది. నవంబర్ 9, 2025న బెంగళూరులోనే ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సరిగ్గా ఇదే అంశంపై స్పష్టంగా మాట్లాడారు. అయితే జూన్ 15, 2026న తాము ఒక “ప్రశ్నను పంపామని” ఖర్గే ఇప్పుడు పేర్కొంటున్నారు. ఆయన అప్పట్లో కర్ణాటక సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా ఉండేవారు. కాబట్టి, తన సొంత రాష్ట్ర రాజధానిలోనే కొద్ది నెలల క్రితం విస్తృతంగా చర్చకు వచ్చిన వివరణ గురించి ఆయనకు తెలియదనుకోవడం నమ్మశక్యం కాని విషయం. అప్పట్లో ఆయనకు ఈ విషయం తెలియని రీతిలో ఆయన శాఖ పనితీరు ఉన్నది అని అనుకున్న పక్షంలో ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఖర్గే ఆ రికార్డులను తెప్పించుకొని సమాధానం తెలుసుకోవచ్చు.

ఇదే ఖర్గే నవంబర్ 9, 2025న  ఆరఎసఎస్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా.. ఇది చట్టపరమైన సూక్ష్మమైన అంశానికి సంబంధించిన విషయం కాదు. భారత రాజ్యాంగం “వ్యక్తుల సమూహం” (Body of individuals)ను చెల్లుబాటు అయ్యే న్యాయపరమైన సంస్థలుగా గుర్తిస్తుంది. దశాబ్దాలుగా భారతీయ న్యాయస్థానాలు కూడా ఈ చట్రం పరిధిలోనే ఆర్ఎస్ఎస్ హోదాను, పనితీరును గుర్తించాయి.ఈ సంస్థ నిర్మాణం, దాని రూపకల్పనరీత్యా, సాంప్రదాయ నమోదిత సంఘం లేదా ట్రస్ట్ తరహాలో అది లేదు. అదే తీరుగా వ్యవహరించడానికి దానికి పూర్తి చట్టపరమైన హక్కు ఉంది అనే వివరణ ఆరఎసఎస్ నుంచి వచ్చింది. మరి అదే ప్రశ్నను ఎందుకు పట్టుబట్టి మరీ అదేపనిగా అడుగుతున్నారు? ఇప్పటికే బహిరంగంగా, చట్టపరంగా సమాధానం చెప్పినా సరే మళ్లీ మళ్లీ అడగడమెందుకు? ఒక ప్రముఖ వ్యక్తి ఒకే ప్రశ్నను పదేపదే లేవనెత్తినప్పుడు అది కాస్త అడిగినట్లు కాకుండా నిందారోపణలు చేస్తున్నట్లుగానే ఉంటుంది. అందరూ అలాగే అనుకుంటారు కూడా. ఈ విషయంలో స్పష్టత, వివరణ కోరే కన్నా కూడా ఎలాంటి సందేహమే లేని చోట, సందేహాన్ని సృష్టించే ప్రయత్నం కిందికే ఇదంతా వస్తుంది. అయితే కొన్ని సంస్థలను ఎంపిక చేసుకొని వాటిపై విమర్శలకు దిగడంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ సంస్థలతో సౌకర్యంగా ఉంటే వాటి జోలికి వెళ్లదు. అదే సంస్థలు తనకు రాజకీయంగా ప్రయోజనకరంగా లేని సమయంలో వాటిని ప్రశ్నిస్తుంది. చట్ట పరిధిలో పనిచేస్తూ, కాలక్రమేణా పరోక్షంగానూ,  ప్రత్యక్షంగానూ ఆమోదం పొందిన ఒక సంస్థ చట్టబద్ధతను ప్రశ్నించడం అనేది సంస్థాగతంగా ఆ సంస్థ స్థిరత్వం పొందిన విషయంపై ఆందోళన చెందుతున్నారనే అనిపిస్తుంది. ఉద్దేశం నిజాయతీతో కూడుకున్నదైతే, ఆ స్పందనను గుర్తించి, దానిపై చర్చించి, లేదా సారాంశంతో కూడిన ఖండన ఇచ్చి ఉండేవారు. దానికి బదులుగా సందర్భానికి సంబంధం లేకుండా, ముందస్తు వివరణను పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ అదే ప్రశ్నలు వేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అడిగిన ప్రశ్నలే అడగడం కంటే విస్తృతమైన బహిరంగ చర్చే మెరుగైంది. కొత్త వాదనలు చేస్తే, వాటిని బహిరంగంగా చేయనివ్వాలి. కానీ విచారణ ముసుగులో స్థిరపడిపోయిన విషయాలను తిరిగి తవ్వడం అనేది ఒక పరిశీలనగా కాకుండా ఒక  వ్యూహంగా భావించాల్సి ఉంటుంది. వీటి మధ్య తేడాను క్షుణ్ణంగా చూడటంలో దేశ ప్రజలు  సమర్థులు.

“ఈ అంశంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ కాకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. మాది ఏదీ రహస్యం కాదు.. బహిరంగంగానే పనిచేస్తున్నాం. మేం ప్రజలను పిలిచి సంఘం గురించి చెబుతున్నాం. ఇదంతా రాజకీయం. ఇలాంటి ఎత్తుగడలు వేయడం సహజం. సంఘ్ ఏర్పడిన 10-15 ఏళ్ల నుంచే, మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాము. మాకు ఇవన్నీ అలవాటే.. అక్కడేమీ ఉండదు గానీ, ఏదో ఉన్నట్టు అనుకుంటాం(ఖర్గే వంటి విమర్శకుల భావనలో). అందువల్ల మేం స్పందించాల్సిన పని లేదు. బ్రిటిష్ కాలంలో సంఘం ఏర్పడింది. ప్రజా మోదంతోనే ఆరంభమైంది. అప్పట్లో మేధోమథనం జరిపినవారు ముందుకెలా సాగారో మీకు చెప్పాను. ఏకాభిప్రాయంతో కార్యాచరణ సాగింది. అదీ సంఘం అంటే.. అందుకే దానికి ఎలాంటి ఆటంకం లేదు. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ కాలేదు. అలా చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరైతే నిధులు కావాలనుకుంటారో వారికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అది అవసరం. అయితే, సంఘం ఉందన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది. కానీ ఒకసారి కోర్టు ఆదేశంతోను, మరోసారి సత్యాగ్రహం కారణంగా నిషేధాన్ని తొలగించారు.  అందువల్ల ప్రభుత్వానికి ఆరఎసఎస్ గురించి తెలుసు. వారు ఆరఎసఎస్‌ని గుర్తించారు కాబట్టే దానిపై నిషేధం విధించారు. ఈ 100 సంవత్సరాల కాలంలో ఇలాంటివి చాలా జరిగాయి. మేం రిజిస్టర్ కావాలని ఏ ఒక్కరు చెప్పలేదు. మా లిఖితపూర్వక రాజ్యాంగం ప్రభుత్వం దగ్గరుంది. మేం 1950 దశకంలోనే ప్రభుత్వానికి దానిని సమర్పించాము. అప్పుడే మేం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెప్పవచ్చు .మేము  ఆ పని చేసి ఉండేవారం. వాళ్లు(ప్రభుత్వం) ఏమీ చెప్పలేదు. అందుచేత నేనెందుకు స్పందించాలి? ఇదంతా రాజకీయం. ఇదేమంత తీవ్రమైన విషయం కాదు. ఏదో ఒక విధంగా సంఘం పనిని ఒకవైపు అడ్డుకుని, ప్రజల మనస్సుల్లో అనుమానాలు రేకెత్తించాలని వాళ్లు(పరోక్షంగా ఖర్గేను ఉద్దేశించి)  అనుకుంటున్నారు. ఇకపై ఇలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే మేమేంటో ప్రజలకు తెలుసు కాబట్టి. మేము రహస్యంగా పనిచేస్తున్నామని వారు విమర్శిస్తుంటారు. మా కార్యకర్తలు అన్ని చోట్లా ఉన్నారు. ప్రజలు వారిని ప్రతిరోజూ చూస్తుంటారు. మా శాఖలు ప్రజలు చూస్తుండగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుంటాయి. మేం బహిరంగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాం. ఈ ఏడాది మేం చాలా మందిని కలుసుకున్నాం. ప్రతి చోటా హిందూ సమ్మేళనం జరుపుకున్నాం. మా పని రహస్యంగా చేసుకునేది అయితే ఇవేవీ సాధ్యం కావు.”

– కేరళ, త్రిశూర్‌లో సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్