
408views
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఎనిమిదోతేదీన వియత్నాం వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ మేరకు రక్షణశాఖ తెలిపింది. ఈ సందర్భంగా హాయి ఫాంగ్‌లోని హాంగ్ హా యార్డ్‌లో వియత్నాంకు 12 హైస్పీడ్ బోట్లను అందజేసే కార్యక్రమానికి రాజ్‌నాథ్ అధ్యక్షత వహిస్తారు. 100 మిలియన్ డాలర్ల రక్షణ శ్రేణి కింద ఎల్ అండ్ టీ (L&T) ఈ బోట్లను నిర్మించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





