
535views
-
అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్‌లు వేసిన టీటీడీ
తిరుపతి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద నుంచి అక్కగార్ల ఆలయం వరకు భక్తులు ఎండ వేడిమికి నడవలేక ఇబ్బంది పడటాన్ని గమనించారు. గ్రీన్ కార్పెట్ వేయించి.. నీరు చల్లించే ఏర్పాట్లు చేయాలని చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావును ఆదేశించారు. శనివారం ఉదయానికి ఈ మార్గంలో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసిన అధికారులు దానిపై నీళ్లు చల్లించే ఏర్పాట్లు చేశారు.





