News

తిరుమలకు త్వరలో 100 ఆర్టీసీ విద్యుత్ బస్సులు

425views

తిరుప‌తి: తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని చెబుతూ త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌కృతిని కాపాడుకుంటేనే మాన‌వాళి మ‌నుగ‌డ సాధ్యం అవుతుంద‌ని స్పష్టం చేశారు.

గత మూడేళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్య రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి