
445views
-
దేశంలో మొదటి డిజిటలైడ్ మున్సిపాలిటీగా మారనున్నట్టు వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇక నుంచి కాగిత రహితంగా మారబోతోంది. ఫైల్స్, డాక్యూమెంట్స్‌లతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు ఇక నుంచి డిజిటల్‌లోనే కొనసాగుతాయని మున్సిపాలిటీ అధికారులు బుధవారం పేర్కొన్నారు. ప్రస్తుతం కాగితాల్లో ఉన్న సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారట.
నగరంలోని నిర్మాణాలు, కూల్చివేతలు, పునర్నిర్మాణాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ కాగిత రహితంగానే కొనసాగుతుందట. ఈ విషయమై LMC ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘డిజిటల్ ఇండియా కింద లక్నో మునిసిపల్ కార్పొరేషన్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని శాఖల పనులను ఇక నుంచి డిజిటలైజేషన్ చేసేందుకు అధికారులు వ్యూహం సిద్ధం చేశారు’’ అని ట్వీట్ చేశారు.





