News

హ‌నుమ జన్మస్థలంపై అనవసర రాద్దాంతం.. ఏపీ సాధుపరిషత్

442views

అమ‌రావ‌తి: ఆంజనేయ స్వామి జన్మస్థలంపై వివాదం నడుస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. సున్నిత విషయాన్ని టీటీడీ, గోవిందానంద సరస్వతి రచ్చ చేశారని పేర్కొన్నారు. భగవంతుడిని ఒక ప్రాంతానికి అంకితం చేయకండన్నారు. స్వామీజీలు కూడా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. టీటీడీ హిందువుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఎవరినీ సంప్రదించకుండానే త‌న ప్రకటనతో రచ్చ చేశారని చెప్పారు. దేవుని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపే కుట్ర జరుగుతోందన్నారు. హిందూ దేవాలయంపై జరిగిన ఘటనలలో జగన్ సర్కార్ ఎక్కడైనా నిందితుల్ని పట్టుకుందా? అని ఆయన ప్రశ్నించారు. టీటీడీని ఒక వ్యాపార సంస్థలా మార్చారని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి