News

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

521views

“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ… అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు జిన్ ‌పింగ్ ‌తో జరిగిన ఫోన్ కాల్ సంభాషణ గురించి వివరించారు.

నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాల మధ్య పోరాట ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇతర ప్రపంచ నాయకులతో పోల్చితే నేను జిన్ ‌పింగ్ ‌తో‌‌తో ఎక్కువసార్లు భేటీ అయ్యా. ఎన్నికల రాత్రి నన్ను అభినందించేందుకు ఆయన ఫోన్ చేసి.. గతంలో చాలాసార్లు చెప్పిన మాటే చెప్పారు. ’21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యాలు మనుగడ సాగించలేవు. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఎందుకంటే… పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యాల్లో ఏకాభిప్రాయం అవసరం. దానికి సమయం పడుతుంది. మీకు ఆ సమయం లేదు’ అని అన్నట్లు తెలిపారు. కానీ, ఈ విషయంలో జిన్ ‌పింగ్ ది తప్పుడు అభిప్రాయమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.