News

పంజాబ్‌ సిక్కు గురుద్వారాను మసీదుగా మార్చారంటూ ఆందోళనలు

357views

పటియాలా: మందిర్‌–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు ఆరోపించాయి. రెండేళ్ళ కింద‌ట అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి కొందరు ముస్లింలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు.

అయితే, దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి