HomeNewsఅమెరికాలో మారియమ్మన్ ఆలయం Aug. 05, 2026 at 12:00 pmNewsఅమెరికాలో మారియమ్మన్ ఆలయంNews2 months agoAugust 3, 2026No tags116views దక్షిణ అమెరికాలోని గయానాలో సమయపురం మారియమ్మన్ ఆలయం నిర్మించనున్నట్ల ఆ ప్రాంతానికి చెందిన భక్తురాలు రూబినా అరోన్ తెలిపారు. శక్తిపీఠాల్లో ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని సమయపురం మారియమ్మన్ ఆలయానికి ఏటా ఆడి మాసం, చిత్తిరై రథోత్సవంలో పాల్గొంటుంటానని చెప్పారు. గత సంవత్సరం అమ్మవారికి మొక్కుకున్న కోరిక నెరవేరడంతో అంగప్రదక్షిణ చేశానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ఆలయం తరహాలో గయానాలోనూ 5.5 ఎకరాల్లో గుడి నిర్మించాలని నిర్ణయించినట్లు చెన్నైలో ఆమె విలేకరులతకు తెలిపారు. ఇందుకోసం చెన్నైలోని హిందూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. విదేశంలో నివాసం ఉంటున్నా తమ కులదైవం సమయపురం మారియమ్మన్ అని చెప్పారు. గయనాలో నిర్మించే రాజగోపురంతో కూడిన ఆలయ ప్రాంగణంలో సమయపురం మారియమ్మన్, వినాయకుడు, మురుగన్, శివుడు, నవగ్రహాలు, కోనేరు, యాగశాల, అగ్నిగుండం లాంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అమ్మవారి భక్తుల సాయం తీసుకుంటానని వివరించారు. share on Facebookshare on Twitterమహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలు.. గెజిట్లో ప్రచురణ అనంతరం అమల్లోకినల్లమలలో వెలుగుచూస్తున్న చారిత్రక ఆనవాళ్లు..