
ఉత్తరాఖండ్: జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం తెరచుకుంది. ఈ రోజు ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్యతో కలిసి శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున హర హర మహాదేవ, భం భం భోలేనాథ్ అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేశారు.
కొందరు భక్తులు వేద మంత్రాలను పఠించారు. ఈ దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచిన సందర్భంగా 15 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 8న బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు.
Source: Nijamtoday





