
455views
-
హనుమాన్ శోభాయాత్ర పై కాల్పులు జరిపినట్టు వెల్లడి
జహంగిర్‌పురి: జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు ఫరీద్‌ను ఢిల్లీ పోలీసులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపై ఫరీద్ కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో అతడిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. మరో ఇద్దరు నిందితులైన జాఫర్, బద్రుద్దీన్‌లను జహంగిర్‌పురి నుంచి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మారణాయుధాలతో మూకను హింసకు ప్రేరేపించారని పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 16నాటి ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పోలీసులు కూడా ఉన్నారు. నాటి హింసలో అనేక వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.





