News

మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!

678views
  • సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామ‌గ్రి

జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

జమ్మూలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీ వేదికకు సమీపంలో పేలుడు సంభవించిన ప్రదేశంలో ఆర్‌డిఎక్స్, నైట్రేట్ సమ్మేళనం పోలీసులకు లభించింది. తాజాగా, ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభ వద్ద లభించినవి పేలుడు పదార్థాలేనని తేలింది.

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలోని జమ్మూలోని లాలియానా గ్రామంలోని మైదానంలో పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభా స్థలం సమీపంలో లభించినవి పేలుడు పదార్థాలేనని తేలడంతో దీని వెనుక ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి