
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు, గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం స్పష్టం చేశారు.
ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర డీజీపీతో సమావేశమై రాష్ట్ర పోలీసు యంత్రానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. దానితో మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు హోంశాఖ జారీ చేసింది. ప్రభుత్వ అనుమతితోనే మే మూడోతేదీ వరకు లౌడ్ స్పీకర్లు వాడాలని తెలిపింది. మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





