
599views
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత పాస్‌పోర్ట్ కు ప్రపంచ దేశాల్లో ఎంతో విలువ ఉందన్నారు. భారత్ తో ఏ రకంగానూ పోల్చుకునే పరిస్థితిలో పాకిస్థాన్ లేదన్నారు. భారత స్వతంత్ర విదేశాంగ విధానం గొప్పగా ఉందని కొనియాడారు. మోడీ నాయకత్వాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ను విదేశీ శక్తులు భయపెడుతున్నాయని, భారత్ జోలికి మాత్రం పోవడం లేదని ఇమ్రాన్ చెప్పారు. పాక్ ప్రతిపక్ష నేతలు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ఏ క్షణమైనా తన హత్య జరిగే అవకాశముందన్నారు.





