News

కీడుచేసే ‘రాత‌’ల‌పై ప‌రువు న‌ష్టం దావా!

485views
  • పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో సంఘ్‌ గురించి అభ్యంతరకర వివ‌ర‌ణ‌

  • ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చ‌యిత‌పై కోర్టును ఆశ్ర‌యించిన కార్య‌క‌ర్త‌

ముంబై: త‌మ పుస్త‌కాలు, ర‌చ‌న‌ల‌తో స‌మాజాన్ని ఉత్తేజ‌ప‌ర‌చాల్సిన ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చయిత‌లు పెడ‌తోవ ప‌డుతూ స‌మాజానికి కీడు చేసే రాత‌ల‌కు పూనుకొంటున్నారు. శేత్ ప్రకాష్‌న్ ఆర్ట్స్ (ముంబయి విశ్వవిద్యాలయం) మొదటి సంవత్సరం పొలిటికల్ సైన్స్ (సెమిస్టర్-1) పుస్తకంలో ప్రముఖ స్వ‌చ్ఛంద సంస్థ‌ రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస‌) గురించి త‌ప్ప‌డు స‌మాచారాన్ని రాశారు. నిజానికి సంఘ్.. ప్ర‌జ‌ల‌కు ఆప‌ద వ‌స్తే క్ష‌ణాల్లో త‌న ప‌క‌డ్బందీ వ్యూహంతో సాయం చేసేందుకు వాలిపోతుంది. అటువంటి సేవా సంస్థ‌పై బుర‌ద జ‌ల్ల‌డం న్యాయం కాద‌ని ఆవేద‌న చెందిన ఓ కార్య‌క‌ర్త కోర్టును ఆశ్ర‌యించారు. మ‌హారాష్ట్ర‌లోని ఘట్కోపర్ విభాగ్ స‌హ కార్య‌వాహ ఆనంద్ కదమ్ వారికి లీగ‌ల్ నోటీసు పంపించారు. ఈ మేర‌కు ఆనంద్ మాట్లాడుతూ అడ్వ‌కేట్ ప్ర‌కాష్ సల్సింగిక‌ర్ ద్వారా ఈ నెల 30వ తేదీన నోటీసు పంపాన‌ని తెలిపారు.

పొలిటికల్ సైన్స్ సెమిస్టర్-1లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. పేజీ నం. 164 – లో సంఘ్ మిలిటెంట్‌తో పోల్చుతూ రాశారు. అయితే, మతపరమైన అల్లర్లకు తామేమీ బాధ్యులం కాదని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.

పుస్తక రచయితలు మహేష్ భగవత్, మోనికా వర్మ, ప్రశాంత్ కేల్కర్, పుస్తక ప్రచురణకర్త, షెథ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసు పంపారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి