News

ఢిల్లీకి రానున్న ర‌ష్యా విదేశాంగ మంత్రి

522views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రేప‌టి నుంచి(31) నుండి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలో ఉండనున్నారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఏప్రిల్ 1న భారత రాజధానిలో భేటీ అవ్వనున్నారు. కీలక అంశాలపై ఆరోజున చర్చలు జరుపుతారు. రష్యా పై పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య ఈ భేటీ ఎంతో చ‌ర్చ‌నీయాంశం అవ్వనుంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ రష్యాతో అనేక అంశాలపై చర్చించనుంది. అదే రోజున కేంద్ర మంత్రి జైశంకర్‌తో యుకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ భేటీ అవ్వనున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి