News

మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం!

494views

ముంబై: మదర్సాలో చిన్నారుల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తే వారి పట్ల కామాంధుడిగా మారాడు. పదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాలసోపరాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మదర్సాలో పనిచేసే అష్రఫ్ అలీ షేక్(24) చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా స్థానికులు చూసి అతడ్ని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వాలివ్ స్టేషన్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి