News

క్రైస్తవ మత బోధనల పేరుతో 191 మంది మృతి కేసులో.. మత భోదకుడు పాల్ మెకెంజీ దోషిగా నిర్ధారణ

5views

కెన్యాలో క్రైస్తవ మత బోధనల పేరుతో అనుచరులను ఉపవాసం ద్వారా మరణించేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పాల్ న్థెంగే మెకెంజీని న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. అతడితో పాటు మరో 28 మందిని కూడా 191 మంది హత్యల కేసులో దోషులుగా తేల్చింది. మృతుల్లో 190 మంది చిన్నారులు, ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు. కెన్యాలోని మొంబాసా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.

మెకెంజీ గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి అనే క్రైస్తవ మత సంస్థకు నాయకత్వం వహించాడు. ఏసుక్రీస్తును కలుసుకోవాలంటే ఉపవాసం చేయాలని అనుచరులకు బోధించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ బోధనల కారణంగా చిన్నారులతో సహా పలువురు ఆహారం తీసుకోకుండా ఉండి మరణించినట్లు విచారణలో వెల్లడైంది.

2023లో కెన్యాలోని షకహోలా అడవిలో సామూహిక సమాధులు వెలుగుచూడటంతో ఈ ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అక్కడి నుంచి 400కు పైగా మృతదేహాలను వెలికితీశారు. ఈ కేసులో దోషులుగా నిర్ధారించిన వారికి నవంబర్ 6న శిక్షలు ఖరారు చేయనున్నారు.