News

భారత విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలకే పెద్ద‌పీట‌

586views
  • రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: భార‌తదేశ విదేశాంగ విధాన నిర్ణయాలు “జాతీయ ప్రయోజనం” దృష్ట్యానే తీసుకొంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. “హింసను తక్షణమే నిలిపివేయాలని”, “శాంతి కోసం నిలబడాలని” భారతదేశం పిలుపునిస్తుందని కూడా ఆయన తెలిపారు.

“మా సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయస్థాయిలో తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే మా నమ్మకంతో మా విధానం మార్గనిర్దేశం చేయబడింది…” అని జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యసభలో తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో జైశంక‌ర్ మాట్లాడారు. “మా సమస్య కాదన్నది భారతదేశం వైఖరి కాదు. మేము శాంతి కోసం ఉన్నాము అనేది మా విధానం” అని ఆయన తేల్చి చెప్పారు”. ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది” అని గుర్తు చేశారు.

కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన రాతపూర్వక ప్రకటనలో, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం విధానం “దృఢంగా, స్థిరంగా” ఉందని స్పష్టం చేశారు. భారతదేశం “దిగజారిపోతున్న పరిస్థితి” పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిందని కూడా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి