
-
బంద్‌కు బీజేపీ పిలుపు
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అంటూ ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. రెండు వర్గాల వారు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు.
దీంతో విగ్రహ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి చేయిజారి పోతుండడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి ఇరు వర్గాల వారిని తరిమికొట్టారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
మునిసిపల్ తీర్మానంతో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం గురించి ఈ రసభ ఏమిటని అంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా సోమవారం బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు.
Source: Nijamtoday





