News

హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు ముస్లిం మూకల బెదిరింపులు

528views
  • వై కేటగిరి భద్రత కల్పించిన ప్రభుత్వం

  • కుహనా లౌకిక వాదులంటూ ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన కర్ణాటక సీఎం

బెంగ‌ళూరు: హిజాబ్‌ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పించినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు హిజాబ్‌ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వీడియో వైరల్‌ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన తమిళనాడు తాహీద్ జమాతే నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్‌(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక​ డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి