
631views
సింధ్ టెస్టింగ్ రేంజ్ నుంచి పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి విఫలమైంది. గాలిలోకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మిస్సైల్ సాంకేతిక లోపంతో గతి తప్పి, సింధ్ ప్రాంతంలోని తానాబులాఖాన్ ప్రాంతంలో పడిపోయింది. నిన్న మధ్యాహ్నం సింధ్ ప్రావిన్స్ లో ఓ గుర్తు తెలియని వస్తువు పొగతో ఆకాశంలో కనిపించడంతో స్థానికులు కంగారు పడ్డారు. మిస్సైల్ ప్రయోగం ఫెయిలయినట్లుగా ఆ తర్వాత మీడియాలో చూసి తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.





