
భాగ్యనగరం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో కూడిన భగీదారీ పరివర్తన్ మోర్చా అనే కొత్త ఫ్రంట్‌ను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.
భగీదారీ పరివర్తన్ మోర్చా ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దళితుడు, ఓబీసీ నాయకుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, వారిలో ఒకరు ముస్లిం ఉంటారని అని కూడా ఒవైసీ చెప్పారు. బాబూ సింగ్ కుష్వాహా నేతృత్వంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మెష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రామ్ ప్రసాద్ కశ్యప్ నేతృత్వంలోని భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ ఈ ఫ్రంట్‌లో భాగమయ్యాయి.
ఆ పార్టీ 0.4 శాతం తక్కువ ఓట్ల శాతం ఓట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క సీట్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. తన వివాదాస్పద ప్రసంగాలు, వాదనలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఏకంగా ‘బుల్డోజర్’ ను కదిలిస్తామని చెప్పారు. ఫలితాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు.
2017లో ఉత్తరప్రదేశ్‌లోని 38 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఎ.ఐ.ఎం.ఐ.ఎం దాదాపు 2 లక్షల ఓట్లను అప్పట్లో తెచ్చుకున్నా.. ఖాతా తెరవడంలో విఫలమైంది. ఈసారి 22.3 లక్షల ఓట్లు సాధించి ఓట్ల శాతాన్ని స్వల్పంగా పెంచుకుంది. ఎ.ఐ.ఎం.ఐ.ఎం అజంగఢ్‌లోని ముబారక్పూర్ స్థానాన్ని గెలుపొందుతుందని అందరూ భావించారు.
అక్కడ బి.ఎస్.పి మాజీ నాయకుడు గుడ్డు జమాలీని పోటీలో నిలిపారు. నేత కార్మికులు, వలస కార్మికులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఒవైసీ ఆచరించే రాజకీయాల బ్రాండ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలు సిద్ధంగా లేరని, ఆయన అటెన్షన్ గ్రేబర్ కావచ్చు కానీ ఓట్లు సాధించే వ్యక్తి కాదని పలువురు ముస్లిం నేతలు చెప్పుకొచ్చారు.
Source: NationalistHub





