
-
ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్
కర్ణావతి: ఈ నెల 11 నుంచి 13 వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. సంఘ్‌లో వివిధ రకాల సమావేశాలు జరుగుతుంటాయని, అన్నింటిలో ప్రతినిధి సభ అత్యంత పెద్దది, నిర్ణయాలు తీసుకునే దృక్కోణంలో అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. ఇంతకుముందు, ప్రతినిధి సభ నాగ్‌పూర్‌లో మాత్రమే జరిగేదని, అయితే నాగ్‌పూర్ వెలుపల అలాంటి ప్రతినిధి సభ మొదటిసారిగా 1988 సంవత్సరంలో రాజ్‌కోట్‌లో నిర్వహించినట్టు తెలిపారు.
ఈ ఏడాది 1,248 మంది ప్రతినిధులు ప్రతినిధి సభలో పాల్గొంటున్నారని, ఈ బైఠక్ (సమావేశం) పూజనీయ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ మార్గదర్శకత్వంలో సర్ కార్యవాహ దత్తాత్రే హోస్బాలే జీ నిర్వహిస్తారని అంబేకర్ తెలిపారు. ఈ బైఠక్‌లో ఎన్నికైన ప్రతినిధిలతో పాటు, ప్రాంత్ సంఘచాలక్, ప్రాంత్ కార్యవాహ, వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ఉంటారని, ఈసారి సంఘటన్ మంత్రి, 36 సంస్థల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు.
ఈ బైఠక్‌లో, సంఘ కార్యానికి సంబంధించి ప్రతి సంవత్సరంలానే ప్రణాళిక రూపొందించబడుతుందని, సమీక్ష అనంతరం ప్రతి ప్రాంత నివేదిక సర్ కార్యవాహ సమర్పిస్తారని అంబేకర్ తెలిపారు. 2025లో సంఘ్‌కు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాంతస్థాయిలో రూపొందించిన ప్రణాళికలను ఈ బైఠక్‌లో ఉంచి చర్చిస్తారని, సంఘ కార్యానికి సంబంధించిన గణాంకాలను కూడా అందజేస్తారని చెప్పారు. సంఘ్ శతాబ్ది వర్ష్ పురస్కరించుకుని, సంఘ కార్యాన్ని 1,00,000 ప్రదేశాలకు విస్తరించాలనే లక్ష్యం తీసుకోబడిందని వెల్లడించారు.
ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల వారు రూపొందించిన ప్రణాళికను కూడా ఈ బైఠక్‌లో చర్చించనున్నారు… కొంత మంది స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.. కాబట్టి అలాంటి సమాచారాన్ని సమాజానికి అందించేందుకు కృషి చేస్తామన్నాని అంబేకర్ అన్నారు. అంతేకాకుండా, గ్రామీణ స్థాయిలో స్వరోజ్‌గార్ (స్వయం ఉపాధి) ద్వారా ప్రజలను ఆత్మనిర్భర్ (స్వయం ఆధారపడేవారు) తయారు చేయడానికి సంఘ్ అనేక కార్యక్రమాలు ప్రారంభించిందని తెలిపారు.
సంఘ్ సమాజంలోని అనేక సంస్థలతో సమరస్తా (సామాజిక సహసంబంధం), పర్యవరణ్ (పర్యావరణం), పరివార్ ప్రబోధన్ వంటి విషయాలపై పని చేస్తోందని, ఈ బైఠక్‌లో ఈ విషయాలను కూడా చర్చించి తదుపరి కార్యాచరణ, దిశా నిర్దేశం చేయబడుతుందన్నారు.
గుజరాత్ సంప్రదాయ సంస్కృతి, గుజరాత్ అభివృద్ధి, గుజరాత్‌లో సంఘ్ కార్యక్రమ క్రమంగా పురోగతి వంటి వాటిపై ప్రతినిధి సభ వేదికగా ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో అఖిల భారతీయ సహ-ప్రచార ప్రముఖులు నరేంద్ర కుమార్, అలోక్ కుమార్, గుజరాత్ సహ ప్రాంత్ కార్యవాహ డాక్టర్ సునీల్‌భాయ్ బోరిసా పాల్గొన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ని డాక్టర్ శిరీష్ కాషికర్ ఏర్పాటు చేశారు.
Source: rss.org





