
కన్నూర్(కేరళ): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండడంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు.

అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) సభ్యుడు. అయితే, ఇప్పుడు అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఎం)తో సంబంధం కలిగి ఉన్నాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిపిఎం మాజీ ఎమ్మెల్యే పి.జయరాజన్‌తో ఆయన సమావేశమైనట్టు, స్థానిక సిపిఎం కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
మాదకద్రవ్యాల వ్యాపారం చేసే జంట కన్నూర్ పట్టణం సమీపంలోని ధర్మడంలోని ప్రసిద్ధ ఇసుక బీచ్‌లకు సమీపంలో ఉన్న ముజప్పిలంగాడ్‌లో ఉంటున్నది. బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సులో డ్రగ్స్‌ను తరలించిన బిల్కిస్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళింది. ఆమెను పోలీసులు పట్టుకోగా, ఆమె భర్త వెంటనే వచ్చాడు. కన్నూర్ నగరంలోని సౌత్ బజార్ సమీపంలోని పార్శిల్ కార్యాలయం నుంచి తమ అధికారులు వారిని పట్టుకున్నారని కన్నూర్ నగర పోలీసు కమిషనర్ ఆర్.ఎలాంగో తెలిపారు.
Source: HINDU POST





