News

సరిహద్దుల్లో క్రీడాస్ఫూర్తి నింపుతున్న భారత సైనికులు

562views

* లడ్డాఖ్ లో తొలిసారి ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్
* పెద్ద సంఖ్యలో పాల్గొన్న పర్వతారోహకులు

మంచులో మామూలుగా నడవటమే చాలా కష్టం. అలాంటిది, నిటారుగా ఉన్న మంచు గోడను ఎక్కారు ఆ పర్వతారోహకులు. అది ఎక్కడో తెలుసుకుందాం..

మాములుగా చలికాలంలో బయటికి వెళ్లాలంటేనే వణికిపోతారు. అలాంటిది మన దేశం సరిహద్దుల్లో గడ్డకట్టే మంచులోనూ గస్తీ కాస్తారు సైనికులు. వారిలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. లడఖ్‌ లో తొలిసారిగా ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీని నిర్వహించారు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు. కేవలం గస్తీ కాసే సైనికులే కాకుండా, బయటివాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ ఈవెంట్‌లో 13 జట్లకు చెందిన 100 మందికి పైగా పర్వతారోహకులు పాల్గొన్నారు. నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం, లేహ్ లడఖ్ మౌంటెనీరింగ్ గైడ్ అసోసియేషన్ సహకారంతో, ITBP ఈ పోటీలను నిర్వహిస్తోంది.

నిపుణుల సమక్షంలో పర్వతారోహకులు ఐస్ వాల్ క్లైంబింగ్‌లో పాల్గొన్నారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె మాథుర్ ఈ ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీని ప్రారంభించారు. సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికుల రుణం తీర్చుకోలేనిదన్నారు ఆర్.కె మాథుర్. ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్. పోటీల నిర్వాహకులను అభినందించారు ఆర్.కె మాథుర్. భవిష్యత్తులోనూ ఇలాంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. 1962లో ITBPని స్థాపించారని, అప్పటినుంచి దేశ సరిహద్దుల్లో నిరంతరం బలగాలు కాపలా కాస్తున్నాయని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.