
534views
జమ్ము: జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి భారీ స్థాయిలో పేలుళ్లకు సంబంధించిన మారణాయుధాలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్లను జప్తు చేశారు.





