
556views
భువనేశ్వర్: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు.
ఆ పోస్టర్లను కవర్ చేసేందుకు వెళ్లిన రోహిత్ కుమార్.. ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలువేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి అక్కడికక్కడే జర్నలిస్టు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కలహందీ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రోహిత్ మదన్‌పుర్- రామ్‌పుర్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.





