News

బెంగళూరు : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి – హిందువునంటూ నాటకం – ముస్లిం మహిళ అరెస్ట్

561views

* హిందువునంటూ స్థానికులను నమ్మించి బెంగళూర్ లో స్థిరపడ్డ ముస్లిం మహిళ

12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్ బోర్డర్ దాటి.. భారత్ లోకి ప్రవేశించిన.. రోనీ బేగమ్ అనే ముస్లిం మహిళ పాయల్ ఘోష్ గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్ లలో డ్యాన్సర్ గా జీవనం ప్రారంభించింది. హిందువునని చెప్పుకుంటూ 15 ఏళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మరోసారి బంగ్లాదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

“రోనీ 12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ కు వచ్చింది. మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్ కుమార్ ను ప్రేమించి పెళ్ళాడింది. పెళ్లి తర్వాత బెంగళూరులోని అంజనానగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. మూడేళ్లపాటు గాలించిన తర్వాత రోనీ ఆచూకీ లభించింది.” అని పోలీసులు తెలిపారు.

రోనీ.. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ వెళ్లాలని నిశ్చయించుకుంది. కోల్కతా వెళ్లి.. అక్కడినుంచి ఢాకా వెళ్లాలని ప్లాన్ వేసింది. అయితే ఇమ్మిగ్రేషన్ డిపార్టెమెంట్ కు అందించిన ధ్రువపత్రాలపై అధికారులకు అనుమానం వచ్చింది. విచారణ అనంతరం.. రోనీ అక్రమంగా భారత్లోకి వచ్చిన బంగ్లాదేశ్ మహిళ అని తేలింది. అప్పటికే రోనీ బెంగళూరు చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు స్థానిక పోలీస్ కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో బ్యాదరహళ్లి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రోనీకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లభించేందుకు సాయపడిన వారి కోసం గాలిస్తున్నామని బెంగళూరు వెస్ట్ డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. అయితే రోనీ భర్త నితిన్ కుమార్ కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.