
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ నరసింహ దేవాలయం.. పజయిదోం నరసింహ స్వామి ఆలయంలో ‘ఉత్సవ ఏనుగుల ఊరేగింపు’ నిర్వహించే ఆరో భక్తుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేరు నమోదు అయింది. ఈ వేడుక ఈ నెల 30న జరుగుతుంది. అనయడి పజాయిదం శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది వార్షిక ఏనుగుల ప్రదర్శన.. సంప్రదాయ దుస్తులతో అలంకరించిన ఎనభై ఏనుగులు, ఆలయ వాద్యబృందంతో జరుగుతుంది. ఈ ఉత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే, కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది వేడుకలో కేవలం పది ఏనుగులు మాత్రమే పాల్గొననున్నాయి.
స్టాలిన్ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి, 9,000 రూపాయలు చెల్లించి వేడుకను బుక్ చేసుకున్నారు. స్టాలిన్ ఈ వేడుకకు హాజరు కానప్పటికీ, తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆలయాన్ని సందర్శించి, పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఆలయ అధికారులు జారీ చేసిన నివేదికలో ఎంకే స్టాలిన్ పేరు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆచారాన్ని అందించే ఆరో భక్తుడు స్టాలిన్.
డీఎంకే వంచన బట్టబయలు
నాస్తికత్వానికి నిత్యం గొడుగు పడుతూ, హిందూ సంప్రదాయాలపై విమర్శలు గుప్పిస్తూ, వాటిపై జరిగే దాడిలో ముందు వరుసలో ఉండే డీఎంకే గుణం ఈ ఉత్సవంతో బట్టబయలు అయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అతను దేవుని పేరు మీద ప్రమాణం చేయడానికి నిరాకరించాడు. తన మనస్సాక్షిపై ప్రమాణం చేశాడు.
తమిళనాడులో నాస్తికత్వం ఈవీ రామసామితో ప్రజాదరణ పొందింది. తర్వాత అది ద్రవిడ భావజాలంలో భాగమైపోయింది. ‘దేవుణ్ణి సృష్టించినవాడు మూర్ఖుడు, దేవుడిని ప్రచారం చేసేవాడు దుష్టుడు, దేవుడిని ఆరాధించేవాడు అనాగరికుడు’ అని ద్రవిడ ఉద్యమంలో మొట్టమొదటి నాస్తికవాది అయిన పెరియార్ అన్నారు.
హిందూ విశ్వాసాలను దుర్వినియోగం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోని డీఎంకే పితామహుడు ఎంకెే కరుణానిధి కూడా నాస్తికుడిగా పరిగణించబడ్డారు. ‘ఈ రాముడు ఎవరు? ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చదివి సివిల్ ఇంజనీర్ అయ్యాడు? ఈ బ్రిడ్జిని ఎప్పుడు కట్టాడు? దీనికి ఆధారాలు ఉన్నాయా?’ అని కరుణానిధి సేతు సముద్రం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ బహిరంగ సభలో మాట్లాడారు.
Source: Organiser





