
ఉజ్జయిని: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా వైభవంగా పునరుద్ధరించేందుకు ప్రణాళికను రూపొందించింది. సుందరంగా తీర్చిదిద్దిన అనంతరం కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఈ నెల 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం విదితమే.
మహాకాళేశ్వర్ ధామ్ వద్ద పునరుద్ధరణ పనులు రెండు దశలుగా విభజించారు. మొదటి దశ ఆగస్టు 2023 నాటికి, రెండోది, చివరి దశ 2028 నాటికి పూర్తవుతుంది. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ధామ్ పునరుద్ధరణ కోసం 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
మహాకాళేశ్వరం వద్ద ఉన్న అసలైన జ్యోతిర్లింగాన్ని 1235లో ముస్లిం ఆక్రమణదారులు కూల్చివేశారు. ఆ తర్వాత నిరంకుశుడైన ఔరంగజేబుతో సహా వివిధ ముస్లిం ఆక్రమణదారులు ఆలయాన్ని అనేక సార్లు కూల్చివేశారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని మరాఠా పాలకుడు రాణోజీ సింధియా పెంచారు.
ఇదిలావుండగా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉదయ్ మహూర్కర్ మాట్లాడుతూ, “ఇది మన 1,000 సంవత్సరాల చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటన. ఉజ్జయినిలోని మహాకాల్ దేవాలయం అనేక మంది ముస్లిం ఆక్రమణదారులచే కూల్చివేయబడింది. అయితే చివరికి 1730లలో మరాఠా పాలకుడు రాణోజీ సింధియా, అతని దివాన్ రామచంద్ర బాబా ద్వారా ఉజ్జయినిలోని అన్ని దేవాలయాలను పునరుద్ధరించారు. మేము వారికి చాలా రుణపడి ఉన్నాము” అని పేర్కొన్నారు.
దాదాపు 2.82 హెక్టార్లలో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని 20.23 హెక్టార్లకు పెంచనున్నారు. మహాకాల్ వికాస్ యోజన ప్రణాళికలో భాగంగా ఉజ్జయిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రణాళికలో మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా ఉన్నది.
900 మీటర్ల పొడవైన కారిడార్‌ను కలిగివున్న మహాకాళేశ్వర్ ధామ్.. థీమ్ పార్క్, హెరిటేజ్ మాల్, ఈ-రవాణా సౌకర్యాలతో నిండి ఉండనుంది. అలాగే, షిప్రా నది నుండి రుద్ర సాగర్ సరస్సుకు మంచినీటి పైపు లైన్లు వేయనున్నారు.
మొదటి భాగంలో చార్ ధామ్ మందిర్ సమీపంలోని ప్రాంతం, నూతన్ స్కూల్ కాంప్లెక్స్, గణేష్ స్కూల్ కాంప్లెక్స్, 900 మీటర్ల పొడవైన కారిడార్, థీమ్ పార్క్, రుద్రసాగర్ ఘాట్, ఫుడ్ కోర్ట్, వాచ్‌టవర్, తదితర పనులు పూర్తి చేయనున్నారు. పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా బేగం బాగ్‌లోని దాదాపు 200 ఇళ్ళను కూల్చివేసి, బహుళ అంతస్తుల భవనాలుగా తీర్చిదిద్దనున్నారు.
రెండో దశ పునరుద్ధరణ పనుల్లో మహరాజ్‌వాడ పాఠశాల భవన్‌ను వారసత్వ ధర్మశాలగా మార్చనున్నారు. రెండు, చివరి దశలో రుద్ర సాగర్, శిప్రా నదిని అనుసంధానం చేయడం, సరస్సు ముందు ప్రాంతాన్ని సుందరీకరించడం, దాదాపు 500 కార్ల సామర్థ్యంతో బహుళ-స్థాయి పార్కింగ్ నిర్మాణం, రుద్ర సాగర్‌పై 210 మీటర్ల బ్రిడ్జి అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.
మహాకాళేశ్వర్‌ధామ్ ప్రాజెక్టులోనూ చుట్టుపక్కల ఉన్న భవనాలను కూల్చివేసి యజమానులకు తగిన పరిహారం చెల్లిస్తామన్నారు. మహాకాళేశ్వరుడు 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ నగరం ఏడు సప్త పురిలలో ఒకటి.. ఇది హిందూ మతంలోని పవిత్ర స్థలం, ఇది యాత్రికులను అనుగ్రహిస్తుందనడంలో సందేహం లేదు.
Source: Organiser





