
709views
-
జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
-
26 జనవరి 2022 నుంచి అమల్లోకి
జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు మాత్రమే పొందగలరని తెలుస్తోంది. అది కూడా 10 లీటర్ల వరకూ ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలుస్తోంది. ఇంకా, ఈ సౌకర్యం ద్విచక్ర వాహనాల వారికే వర్తించనుంది. హేమంత్ సోరెన్ ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. “పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 25 ఉపశమనం ఇవ్వనుంది. 26 జనవరి 2022 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది” అని జార్ఖండ్ సీఎంవో ట్వీట్ చేసింది.

Source: NationalistHub





