
644views
-
23 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
-
అదుపులో 6,623 మంది
చెన్నై: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో జరుగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు రూ. 23 కోట్లు విలువగల హెరాయిన్, రూ. 4.2 కోట్లు విలువ చేసే గుట్కా, రూ. 18 కోట్లు విలువ చేసే గంజాయిని అధికారులు జప్తు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 6,623 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తూత్తుకుడిలో 23 కిలోల హెరాయిన్ బయటపడింది.
పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు గంజాయి అక్రమ రవాణా విషయంలో మూడు వారాల్లో ఏకంగా 816 కేసులు నమోదయ్యాయి. 871 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.88కోట్ల గంజాయిని పట్టుకున్నారు. డ్రగ్స్‌ను పట్టుకునే విషయంలో ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. డ్రగ్ డీలర్ల సమాచారం తెలిస్తే వాట్సాప్ ద్వారా తమకు చెప్పాలని సూచించారు.





