
విజయవాడ: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శుక్రవారం వెల్లడించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
* 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
* 07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30 తేదీల్లో)
* 07456 సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31 తేదీల్లో)
* 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30 తేదీల్లో)
* 07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30 తేదీల్లో)
* 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28 తేదీల్లో)
* 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30 తేదీల్లో)
Source: Tv9





