
545views
చండీగఢ్: లూథియానా కోర్టులో పేలుడుకు కారణం.. సస్పెండ్‌కు గురైన పోలీసు అధికారేనని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
మృతుడు, మాజీ పోలీసు గగన్‌దీప్ సింగ్ పేలుడుకు పాల్పడ్డాడు… 2019లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తర్వాత ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు.. రెండేళ్లు జైలు జీవితం గడిపాడు… పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారన్నారు.
Source: Organiser





