News

అన్నవరం దేవాలయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ

688views

అన్న‌వ‌రం: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు అక్రమాలు జరిగాయని, నిబంధనలు పాటించడం లేదని దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్‌ ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, సిబ్బంది బృందం రికార్డులు పరిశీలించి వివరాలు సేకరించారు.

లీజులు, బకాయిల వసూలు, అభివృద్ధి పనులు నాణ్యత, అంచనాలు పెంచడం, ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, సరకుల కొనుగోలు ఇలా సుమారు 25 అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దేవస్థానం ఛైర్మన్‌ అర్హతపైనా మరో ఫిర్యాదు అందడంతో ఆయా అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి