
-
కోర్టులో మహిళ పిటిషన్
-
170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత మొఘల్ వారసులం అంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ హౌరాలోని మురికివాడలో నివసించే సుల్తానా తాను మొఘల్ చక్రవర్తి మునిమనవడు మీర్జా మహమ్మద్ బీదర్ భక్త్ భార్యని అని తెలిపింది.
“రంగూన్ నుండి తప్పించుకుని తాము భారత్‌కు వచ్చి ఉంటున్నామని చెప్పింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన 68 ఏళ్ల సుల్తానా బేగం తాను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్య అని చెబుతుంది. ఈ పిటిషన్‌లో తాను మొఘలుల వారసురాలిని కనుక ఎర్ర కోటను తనకు అప్పగించాలని లేకపోతే.. అందుకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతుంది సుల్తానా.
అయితే, సుల్తానా వేసిన పిటిషన్‌పై జస్టిస్ రేఖాధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించింది. 1857లో అన్యాయం జరిగితే 170 ఏళ్ల తర్వాత మీరు కోర్టును ఆశ్రయించారు. దయచేసి మీరు ఇన్ని రోజులు ఏమి చేశారు అంటూ ప్రశ్నించింది. సుల్తానా తరపు న్యాయవాది తన క్లయింట్ నిరక్ష్యరాసులని. అందుకే కోర్టుని ఆశ్రయించలేదని వివరించారు. అది అసలు ఆమోదయోగ్యం కాదంటూ ధర్మాసనం సుల్తానా పిటిషన్‌ను కొట్టివేసింది.
Source: Tv9





