
471views
విజయవాడ: 2021కు విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో కాచిగూడ స్టేషన్ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి దక్కింది. సంస్థల కేటగిరిలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ రెండో బహుమతి, సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం ‘సంచాలన్ భవన్’ కు మెరిట్ సర్టిఫికెట్ లభించింది.





