News

చిత్తూరు జిల్లాలో వింత శబ్దాలు

466views
  • భయాందోళనలో ప్రజలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు.. భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఇలాంటి శబ్దాలు వస్తాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి