News

శబరిమలకు పోటెత్తిన భక్తులు

633views
  • ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం

తిరువ‌నంత‌పురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్ర‌భుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో బుకింగ్ చేసుకునే విధానం పూర్తవుతుంది. వర్చువల్ బుకింగ్​తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్​ బుకింగ్ అనుమతిస్తున్నారు. 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా 30న మళ్లీ శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.