News

అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు

571views

భాగ్యనగరం: తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అనంతరం ఈ రోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌ ఛాంబర్‌లోకి తీసుకురాగా కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. కాసేపటి క్రితం సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి