438
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ ఎంపీ నారన్‌భాయ్ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో రాయ్ తన రాతపూర్వక సమాధానంలో, ‘శ్రీనగర్‌లో మైనారిటీ కమ్యూనిటీల కోసం పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమలులో ఉంది’ అని తెలిపారు.
‘స్టాటిక్ గార్డుల రూపంలో సమూహ భద్రతతో పాటు, మైనారిటీలు నివసించే ప్రాంతాలలో పగలు, రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలల్లో ప్రత్యేక బృందాల పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చురుకైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
Source: Organiser