
625views
విజయవాడ: మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటకు వన్నె తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక స్వర్గవాసం దిగ్భ్రాంతిని, దుఃఖాన్ని, బాధను కలుగజేసిందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు శ్రీ వి.భాగయ్య, సంఘ్ దక్షిణ్ మధ్య క్షేత్ర సహ సంఘ్‌చాలక్ శ్రీ దూసి రామకృష్ణ అన్నారు. ఈ మేరకు వారొక ప్రకటన విడుదల చేస్తూ.. సినీ రంగంలో పాటల రూపంలో సాంస్కృతిక జీవన విలువలతో ప్రభావాన్ని చూపిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి ఆకస్మిక మరణం తీరని లోటని, వారికి సంఘం తరుఫున తీవ్ర సంతాపాన్ని, శ్రద్ధాంజలిని ఘటిస్తున్నామని పేర్కొన్నారు.





