News

‘సిరివెన్నెల’ ఇక లేరు!

526views

సికింద్రాబాద్‌: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) శివైక్యం పొందారు. ఈ విషాద వార్త విన్న సినీ అభిమానులు, టాలీవుడ్‌ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ మరింత తీవ్రమవడంతో ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Source:  Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి