
582views
-
ఖండించిన భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయంగా భారత్ ప్రకటించిన 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను దేశం మీదుగా తరలించేందుకు ఇటీవలే అంగీకరించిన పాక్ ప్రభుత్వం.. తాజాగా కొన్ని షరతులను విధించింది. గోధుమలతో పాటు ఔషధాల సరఫరాకు సంబంధించి రవాణా సౌకర్యాన్ని అందించే విధానాలపై జరిగిన చర్చల్లో కొన్ని షరతులు విధించింది.
అయితే, మానవతా సహాయం వంటి సున్నితమైన అంశాల్లో షరతులు విధించడం ఏంటని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశ్నిస్తోంది. ‘గోధుమల తరలింపునకు ఎలాంటి షరతులు విధించకుండా అఫ్గాన్ ప్రజల మేలు కోసం రవాణా సౌకర్యానికి అనుమతించాలని స్పష్టం చేసింది భారత్. కానీ.. పాక్ పలు రకాలుగా అడ్డుకుంటోందని’ అధికారులు తెలిపారు.





