News

అప్పుల ఊబిలో పాక్!

622views
  • రూ.50 లక్షల కోట్లకు చేరిన రుణాలు

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాక్ వెల్లడి

  • ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆర్థిక తిరోగమనం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాక్ అప్పులు రూ. 50 లక్షల కోట్లు దాటినట్టు నివేదికలో పేర్కొంది. ఇమ్రాన్​ ఖాన్​ ప్రధాని అయ్యాక పరిస్థితి దిగజారినట్టు తెలుస్తోంది.

బాకీ ఉన్న రూ.50.5 లక్షల కోట్లలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్టు ఎస్​బీపీ తెలిపింది. గడిచిన 39నెలల్లో 70శాతం అప్పులు పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య రూ.14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్​ ప్రభుత్వం పొందినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి