
656views
-
కాలుష్య నివారణకు నిర్ణయం
న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు తన వంతు బాధ్యతగా డీజిల్ వాహనాలను ఉత్పత్తిని చేయట్లేదని దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తెలిపింది. మళ్లీ డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్ వాహనాల ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని పేర్కొంది. అందువల్ల అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే కార్ల ఉత్పత్తిపైనే కంపెనీ దృషి సారిస్తోందని తెలిపింది. ఇప్పటికే సెలెరియో ఈ తరహాలో రూపొందించిందేనని, లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వివరించారు.





