
554views
-
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబర్ ఐలాండ్స్, కోస్టల్, అండ్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, పొరుగున ఉన్న నార్త్ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణలో భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది.





